పవన్‌తో షూటింగ్ గొప్ప జ్ఞాపకం : క్రిష్

by  |
పవన్‌తో షూటింగ్ గొప్ప జ్ఞాపకం : క్రిష్
X

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంపై క్రిష్ ట్వీట్ భారీ హైప్ క్రియేట్ చేసింది. తొలిసారి సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్న పవన్.. ఇప్పటికే పదిహేను రోజుల షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ పక్షం రోజుల్లో ప్రతీ క్షణం టీమ్ అందరికీ గొప్ప జ్ఞాపకంలా కళ్ల ముందు కదులుతోందన్నారు క్రిష్. ‘ఇప్పటికే చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తోందని.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం మాత్రమే’ అని పవన్‌ను కొనియాడారు. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటూ ఉండాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, పవన్ కళ్యాణ్ 27వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో తెలంగాణ రాబిన్ హుడ్ లాంటి పాత్రలో కనిపించబోతున్న పవన్ లుక్ అదిరిపోనుంది. తెలంగాణ నేపథ్యంలో కథ సాగనుండగా.. ఎంఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ లక్ష్మణ్ భారీ ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేస్తుండగా.. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



Next Story

Most Viewed