కోరమీసం పోలీసోడితో శ్రుతి రొమాన్స్

by  |
కోరమీసం పోలీసోడితో శ్రుతి రొమాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహరాజ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ ‘క్రాక్’. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలోని ‘కోరమీసం పోలీసోడా’ లిరికల్ సాంగ్ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేశారు. గోపిచంద్..రవితేజ ‘డాన్ శ్రీను’ చిత్రంతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటిస్తోన్న ఈ సినిమా..వాస్తవ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కింది. ఈ ‘క్రాక్’ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు.

హీరోయిన్ శ్రుతిహాసన్‌తో రవితేజ ‘బలుపు’ చిత్రంలో జోడీ కట్టారు. ఈ చిత్రంతో వీరి కాంబో రెండోసారి రిపీట్ అవుతోంది. ఈ కోరమీసం సాంగ్‌లో హీరో హీరోయిన్‌‘క్రాక్’ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుద‌ల కాగా, ఇది మూడో పాట. ఎస్.ఎస్.థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజిష‌న్‌లో రూపొందిన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ‘కోర మీసం పోలీసోడా’ సాంగ్‌‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.


Next Story

Most Viewed