దేవరకొండ #betheREALMAN అంటున్న కొరటాల.. టాస్క్ పూర్తి

by  |
దేవరకొండ #betheREALMAN అంటున్న కొరటాల.. టాస్క్ పూర్తి
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ #betheREALMAN చాలెంజ్ ను యాక్సెప్ట్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించిన కొరటాల శివ… నెల రోజుల ఫుటేజ్ ఆల్రెడీ మిస్ అయింది తారక్ అన్నయ్యా అంటూ ట్వీట్ చేశారు.

కాగా బుధవారం తారక్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేస్తూ వీడియో అప్ లోడ్ చేశాడు కొరటాల శివ. సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ #betheREALMAN చాలెంజ్ లో భాగంగా… ఇంట్లో బోల్లు కడిగి, ఇళ్లు శుభ్రంగా తుడిచాడు కొరటాల. ఆ తర్వాత ఫర్నీచర్ క్లీన్ చేశాడు. ఇంట్లో పని మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా… రాను రాను అలవాటయ్యి… ఇప్పుడు సరదాగా ఉందని చెప్పాడు. ఫర్దర్ గా హీరో విజయ్ దేవరకొండ ను #betheREALMAN చాలెంజ్ కు నామినేట్ చేశారు కొరటాల.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న సినిమాలో… చిరు, చెర్రీ గురుశిష్యులు గా నటించనున్నారు. దేవాలయ భూముల ఆక్రమణ నేపథ్యంలో సాగనుంది ఆచార్య కథ.


Tags: Koratala Shiva, Sandeep Vanga, NTR, Vijay devarakonda, betheREALMAN, challenge


Next Story

Most Viewed