బ్రేకింగ్: కొండపోచమ్మ డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం

75

దిశ, జగదేవపూర్: మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామస్తుడు, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ చెక్కల నరేష్ గురువారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతకొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో బాధపడుతున్న నరేష్ గురువారం జరిగిన గొడవతో తీవ్ర మనస్థాపం చెంది పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ములుగు మండలం వంటిమామిడి సమీపంలోని లక్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నరేష్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..