కొండా లేఖ : కొత్త పార్టీనా? లేదంటే వేరే పార్టీలో చేరాలా?

by  |
కొండా లేఖ : కొత్త పార్టీనా? లేదంటే వేరే పార్టీలో చేరాలా?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్రాతపూర్వకంగా స్పష్టం చేశారు. పార్టీకి ద్రోహం చేయడం సరికాదనే ఉద్దేశంతో ఇంతకాలం వేచి ఉండాల్సిన అవసరం వచ్చిందని వివరించారు.

అంతేకాకుండా.. ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు నష్టం జరగకూడదని ఓపిక పట్టానని తెలిపారు. పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల కంటే ముందే ఫోన్ చేసి పార్టీ వీడుతున్నట్లు చెప్పానని పేర్కొన్నారు. అప్పుడు ఉత్తమ్ ఈ విషయం బహిర్గతం చేయకండి, ఎవరికీ చెప్పకండి, పార్టీ నష్టపోతుందని చెప్పినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అందుచేత పార్టీ వీడుతున్నట్లు ఎవరికీ చెప్పలేదని, పార్టీ దూరంగా ఉంటున్నట్లు వివరించినప్పటికీ మీడియా ద్వారా అందరికీ తెలిసిందన్నారు.

దీంతో రెండు, మూడు నెలల సమయంలో పార్టీ కార్యకర్తలను, నాయకులను కలిసి మన ప్రాంత, రాష్ట్ర, దేశ అభివృద్ధి కోసం ప్రజలతో చర్చిస్తామని తెలిపారు. అప్పుడు నాతో కలిసివచ్చే వాళ్లతో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏ ఒక్కరిపై ఒత్తిడి ఉండదని, స్వంత నిర్ణయం తీసుకోవచ్చునని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. కొత్త పార్టీ పెట్టాలా… ఇండిపెండెంట్ గా ఉండాలా… మరో పార్టీలో చేరాలా అని అందరితో కలిసి చర్చిస్తామని కొండా వివరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి మద్దతుగా నిలిచిన శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ కు ఇచ్చిన లేఖలో కొండా ప్రస్తావించారు.


Next Story

Most Viewed