- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజీలేని పోరాట యోధుడు..!
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: రాజీలేని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని శాసన మండలి మాజీ అధ్యక్షుడు కనకమామిడి స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం నారాయణగూడలోని పద్మశాలి భవన్లో అఖిల భారత పద్మశాలి సంఘం, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, ఏఎల్ మల్లయ్యలను సంఘం […]</p>

X
దిశ, ముషీరాబాద్: రాజీలేని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని శాసన మండలి మాజీ అధ్యక్షుడు కనకమామిడి స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం నారాయణగూడలోని పద్మశాలి భవన్లో అఖిల భారత పద్మశాలి సంఘం, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, ఏఎల్ మల్లయ్యలను సంఘం సభ్యులు సత్కరించారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ చిన్నతనంలోనే ఉద్యమస్ఫూర్తిని పెంచుకున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం బాపూజీ ఎంతగానో కృషి చేశారని, వారి ఆశయాలను భావితరాలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు.
Next Story






