- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం
<p>దిశ, వెబ్‌డెస్క్: కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం మల్లికార్జున స్వామి, మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహ వేడుకను పండితులు నిర్వహించారు. ఈ క్రతవును మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్సి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో వేద పండితులు, పురోహితులు ఘనంగా నిర్వహించారు. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు కల్యాణం జరుగడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం మల్లికార్జున స్వామి, మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహ వేడుకను పండితులు నిర్వహించారు. ఈ క్రతవును మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్సి మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో వేద పండితులు, పురోహితులు ఘనంగా నిర్వహించారు. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు కల్యాణం జరుగడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వివాహ మహోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. మలన్న కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Next Story






