- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు నెలలుగా భాస్కర్ దళం సంచారం..
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కడంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తాజాగా కొమురం భీం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ స్పందించారు. గత మూడునెలల నుంచి భాస్కర్ దళం ఉమ్మడి జిల్లాలో సంచరిస్తోందని.. వారికోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి 5 రోజుల్లో మూడు సార్లు తప్పించుకున్నారని ఆయన వివరించారు. ఆ క్రమంలోనే కాగజ్‌నగర్ రూరల్ సీఐ బృందానికి మావోయిస్టులు మరోసారి తారసపడ్డారని, లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారన్నారు. పోలీసులు జరిపిన ఎదురు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కడంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తాజాగా కొమురం భీం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ స్పందించారు. గత మూడునెలల నుంచి భాస్కర్ దళం ఉమ్మడి జిల్లాలో సంచరిస్తోందని.. వారికోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి 5 రోజుల్లో మూడు సార్లు తప్పించుకున్నారని ఆయన వివరించారు.
ఆ క్రమంలోనే కాగజ్‌నగర్ రూరల్ సీఐ బృందానికి మావోయిస్టులు మరోసారి తారసపడ్డారని, లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారన్నారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం కాగా, భాస్కర్ తప్పించుకున్నాడని ఇన్చార్జి ఎస్పీ వెల్లడించారు. ఇప్పటికీ కడంబ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోందని, వారు తప్పించుకు పారిపోయే అవకాశం లేదన్నారు.
Next Story






