స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్.. అది తీసేసి నగ్నంగా ఉన్నానంటూ

by  |
స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్.. అది తీసేసి నగ్నంగా ఉన్నానంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మాస్టర్’ చిత్రంలో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చిన బ్యూటీ మాళవిక మోహనన్. ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకున్న అమ్మడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా కరోనా కాలంలో షూటింగ్ ఎంత కష్టమో అమ్మడు చెప్పుకొచ్చింది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ “గతేడాది నుంచి మాస్క్ లేకుండా బయటకు వెళ్లాలంటేనే భయమేస్తుందని, తాము షూటింగ్ చేసే దగ్గర కొవిడ్ ప్రోటోకాల్స్ కఠినంగా ఉన్నాయని చెప్పింది. అందరిలా ఎప్పుడు మాస్క్ లను పెట్టుకొని నటించలేము.. తాము సెట్ లోకి వెళ్ళగానే మాస్క్ తీసివేస్తామని అప్పుడు తానూ నగ్నంగా ఉన్నా ఫీలింగ్ వస్తుందని హాట్ కామెంట్స్ చేసింది.

ఆ ఒక్కటీ లేకుండా నగ్నంగా ఉన్నాను. అంతగా మాస్క్ మన వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం అయింది కనుక దాన్ని తీసివేసినప్పుడు వింతగా అనిపిస్తుంది అని అంది. ఇక టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకెప్పటినుంచో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఉందని, విజయ్ దేవరకొండతో హీరో అనే చిత్రంతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. అది కొన్ని కారణాల వలన ఆగిపోవడంతో తన టాలీవుడ్ ఎంట్రీ లేట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్ తో తెలుగు తెరపై కనిపిస్తానని చెప్పుకొచ్చింది.


Next Story

Most Viewed