- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్రపరిశ్రమలో విషాదం: కరోనాతో 'అసురన్' నటుడు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్రపరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. ఇప్పటీకే ఈ మహమ్మారి బారినపడి ఎంతోమంది ప్రముఖులు మృత్యువాత పడ్డారు. తాజాగా మరో నటుడు కరోనా బారిన పడి కన్నుమూశాడు. తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు నితీష్ వీరా సోమవారం ఉదయం మృతిచెందారు. గతకొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన నితీష్ చెన్నైలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే గతరాత్రి ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: చిత్రపరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. ఇప్పటీకే ఈ మహమ్మారి బారినపడి ఎంతోమంది ప్రముఖులు మృత్యువాత పడ్డారు. తాజాగా మరో నటుడు కరోనా బారిన పడి కన్నుమూశాడు. తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు నితీష్ వీరా సోమవారం ఉదయం మృతిచెందారు. గతకొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన నితీష్ చెన్నైలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే గతరాత్రి ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నితీష్ వీరా మృతితో కోలివుడ్ లో విషాదం అలముకుంది. నితీష్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నితీష్ తమిళ్ లో వచ్చిన ‘పేరరుసు’, ‘వెన్నిల కబడి కుళు’, ‘పుదు పేట్టై’, ‘అసురన్’, రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రంలోని కీలక పాత్రలు పోషించాడు. నితీష్ మరణం కోలీవుడ్ కి తీరని లోటని సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






