#WorldStandsWithKohli.. కోహ్లీకి నెట్టింట్లో పెరిగిన క్రేజ్

by  |
#WorldStandsWithKohli.. కోహ్లీకి నెట్టింట్లో పెరిగిన క్రేజ్
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నది. వన్డే కెప్టెన్సీ నుంచి తీసేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి కోహ్లీ అనేక విషయాలను వెల్లడించారు. తన పట్ల బీసీసీఐ ప్రవర్తించిన తీరుతో పాటు.. గంగూలీ అసలు మాట్లేడలేదని వివరించాడు. ఆ మీడియా సమావేశం తర్వాత బీసీసీఐ పెద్దలు కోహ్లీపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇకపై కోహ్లీ విషయాన్ని బహిరంగంగా మాట్లాడే అవకాశం లేదని గంగూలీ కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కోహ్లీకి అనూహ్యంగా మద్దతు పెరిగింది.

కోహ్లీ అభిమానులు #WorldStandsWithKohli అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీకి అండగా నిలిచారు. మాజీ క్రికెటర్, మాజీ సెలెక్టర్ కీర్తి ఆజాద్ కోహ్లీకి అండగా మాట్లాడాడు. కోహ్లీ వన్డే కెప్టెన్సీని తొలగించాలని సెలెక్టర్లు భావించి ఉంటే ముందు ఆ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడికి చెప్పాలి. గతంలో కూడా సెలెక్టర్లు ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అధ్యక్షుడికి వివరించే వారిమని.. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే బయటకు ప్రకటించే వారమని కీర్తి ఆజాద్ చెప్పాడు. ముందుగా చెప్పి ఉంటే గంగూలీ తప్పకుండా కోహ్లీతో మాట్లాడి ఉండే వాడని ఆజాద్ అభిప్రాయపడ్డాడు. ఇక కోహ్లీని తీసేసిన విధానం ఎవరికీ నచ్చలేదని అన్నాడు. సెలెక్టర్లు అందరూ గొప్పవాళ్లే .. కానీ కోహ్లీ ఆడిన ఆటలో సగం మ్యాచ్‌లు కూడా వాళ్లు ఆడలేదు అని ఎద్దేవా చేశాడు.


Next Story

Most Viewed