కోహ్లిని చూస్తే వెన్నులో వణుకుపుడుతున్నది: స్మిత్

by  |
కోహ్లిని చూస్తే వెన్నులో వణుకుపుడుతున్నది: స్మిత్
X

దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట తీరు రోజురోజుకూ మరింత మెరుగవుతున్నది. అతడిని చూస్తే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుడుతున్నదని ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మాన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహిస్తున్న పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘2007లో కోహ్లి శిక్షణ నిమిత్తం బ్రిస్బేన్ అకాడమీకి వచ్చాడు. అప్పట్లో మైదానం, బయట కూడా మాట్లాడుకునే వాళ్లం. ఆతర్వాత ఆటలో ఇద్దరం సమాంతరంగా ఎదిగాం. అప్పట్లో చూసిన కోహ్లి కంటే ఇప్పుడు అతను మరింత మెరుగుపడ్డాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. ఇక ప్రపంచకప్ సమయంలో తనను ట్రోల్ చేస్తున్న అభిమానులను కోహ్లి వారించాడు. అది తన మంచి మనసుకు నిదర్శనం. నేను ఆ విషయంలో అతనికి ధన్యవాదాలు తెలిపాను’ అని స్మిత్ చెప్పాడు. ఇక ఐపీఎల్ జరిగితే తప్పకుండా ఆడతానని, రాబోయే భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని స్మిత్ వెల్లడించాడు.


Next Story