- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధోనీ అంటే గౌరవంతో పాటు నమ్మకం కూడా: కోహ్లీ
<p>దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో తన అనుబంధాన్ని విరాట్ కోహ్లీత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్‌లో ఉన్న కోహ్లీ అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ధోనీ అంటే తనకు చాలా గౌరవమని.. అదే సమయంలో అతడిని పూర్తిగా నమ్ముతానని కోహ్లీ చెప్పాడు. ఇద్దరి మధ్య సోదరభావంతో కూడిన స్నేహబంధం ఉందని చెప్పాడు. ఇక ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో రోజూ గంట సేపు ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నానని.. ఆ […]</p>

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో తన అనుబంధాన్ని విరాట్ కోహ్లీత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్‌లో ఉన్న కోహ్లీ అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ధోనీ అంటే తనకు చాలా గౌరవమని.. అదే సమయంలో అతడిని పూర్తిగా నమ్ముతానని కోహ్లీ చెప్పాడు. ఇద్దరి మధ్య సోదరభావంతో కూడిన స్నేహబంధం ఉందని చెప్పాడు. ఇక ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో రోజూ గంట సేపు ట్రెయినింగ్‌లో పాల్గొంటున్నానని.. ఆ తర్వాత కుటుంబంతో గడపుతున్నట్లు కోహ్లీ చెప్పాడు.
తనను పాత తరం బౌలర్లలో వసీం అక్రమ్ చాలా ఇబ్బంది పెట్టాడని.. అతని బౌలింగ్‌లో ఆడటానికి కాస్త తడబడ్డానని చెప్పాడు. ఇక టీమ్ ఇండియాలో చాహల్ చాలా సరదాగా ఉంటాడని, డివిలియర్స్ చాలా ఆకట్టుకుంటాడని చెప్పాడు. కాగా, కైల్ జేమిసన్‌కు చాలా సిగ్గు అని విరాట్ చెప్పుకొచ్చాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సంబంధించిన జెర్సీని చూపించాలని కోరగా.. దానికి ఇంకా సమయం ఉందంటూ కోహ్లీ దాటవేశాడు.






