చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-03 09:51:54  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌కు 48 గంటలు సమయం ఇస్తున్నాను అని చంద్రబాబు అన్న వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ నేతల రాజీనామాలను డిమాండ్ చేసే నైతిక హక్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు లేదని తేల్చి చెప్పారు. జగన్ బీ-ఫామ్ ఇస్తే, నియోజకవర్గ ప్రజలు తమను గెలిపించుకున్నారని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన ఓడిన పవన్ కళ్యాణ్.. అది జీర్ణించుకోలేకనే ఎవరూ కూడా [&hellip;]</p>

చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌కు 48 గంటలు సమయం ఇస్తున్నాను అని చంద్రబాబు అన్న వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ నేతల రాజీనామాలను డిమాండ్ చేసే నైతిక హక్కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు లేదని తేల్చి చెప్పారు. జగన్ బీ-ఫామ్ ఇస్తే, నియోజకవర్గ ప్రజలు తమను గెలిపించుకున్నారని ఆయన గుర్తు చేశారు.

గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన ఓడిన పవన్ కళ్యాణ్.. అది జీర్ణించుకోలేకనే ఎవరూ కూడా ఎమ్మెల్యేగా ఉండకూడదు అనుకుంటున్నారని దుయ్యబట్టారు. కొడుకును గెలిపించుకోలేని చంద్రబాబు నాయుడు మాకు సవాల్ విసరడం ఏంటని కొడాలి ప్రశ్నించారు. టీడీపీ అధినేతకు గత ఆరు నెలల నుంచి పని పాట లేదని ఎద్దేవా చేశారు.

Next Story