- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్టిఫికెట్ అడిగితే కత్తితో దాడి
by Batti.Sumithra |
<p>దిశ, కోదాడ: బైక్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం వెళితే కత్తితో దాడి చేసిన ఘటన హుజూర్ నగర్‌లో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన జంగం సైదులు హిందుజా ఫైనాన్స్ కంపెనీలో 2016లో బైక్‌ను ఫైనాన్స్‌లో తీసుకున్నాడు. బైక్‌కు సంబంధించి ఇన్‌స్టాల్‌మెంట్స్ పూర్తిగా కట్టడంతో క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం శనివారం హిందుజా ఫైనాన్స్ ఆఫీసుకు వచ్చాడు. సంస్థ ఉద్యోగి నరేంద్రతో మాట్లాడుతుండగా.. మాటామాటా పెరిగి ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఈ క్రమంలో నరేంద్ర […]</p>

X
దిశ, కోదాడ: బైక్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం వెళితే కత్తితో దాడి చేసిన ఘటన హుజూర్ నగర్‌లో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన జంగం సైదులు హిందుజా ఫైనాన్స్ కంపెనీలో 2016లో బైక్‌ను ఫైనాన్స్‌లో తీసుకున్నాడు. బైక్‌కు సంబంధించి ఇన్‌స్టాల్‌మెంట్స్ పూర్తిగా కట్టడంతో క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం శనివారం హిందుజా ఫైనాన్స్ ఆఫీసుకు వచ్చాడు. సంస్థ ఉద్యోగి నరేంద్రతో మాట్లాడుతుండగా.. మాటామాటా పెరిగి ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఈ క్రమంలో నరేంద్ర కోపంతో ఒక్కసారిగా జంగం సైదులుపై కత్తితో దాడి చేశాడు. దీంతో సైదులు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story






