- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cricket big News : టీమిండియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు బంపర్ ఆఫర్. సౌతాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా రాహుల్ బాధ్యతలు వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్నాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ క్రమంలో వన్డే సిరీస్‌కు ప్రారంభం నాటికి రోహిత్ కోలుకోవడంపై […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు బంపర్ ఆఫర్. సౌతాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా రాహుల్ బాధ్యతలు వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్నాడు. అయితే అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ క్రమంలో వన్డే సిరీస్‌కు ప్రారంభం నాటికి రోహిత్ కోలుకోవడంపై సందిగ్ధత నెలకొంది.
ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో బీసీసీఐ.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ గాయం నుంచి కోలుకోపోతే కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనవరి 19 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌తో సెంచరీ బాదిన విషయం తెలిసిందే.






