బిగ్‌న్యూస్.. టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

by  |

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. తొడ కండరాల నొప్పి కారణంగా టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమైన రోహిత్ శర్మ స్థానంలో రాహుల్‌ను వైస్ కెప్టెన్‌ ఎంపిక చేసినట్టు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) అధికారికంగా ప్రకటించింది. ఇక కెప్టెన్‌ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే సౌతాఫ్రికా చేరుకుంది. ఈ నెల 26 నుంచి మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మతో పాటే కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్‌ హోదా బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టెస్టు జట్టుకు కూడా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయడం విశేషం.

Next Story

Most Viewed