కేసీఆర్​ ఢిల్లీ వెళ్లింది కేవలం దాని​కోసమే.. కిషన్​రెడ్డి సంచలన కామెంట్స్

67
Kishanreddy

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌కు వెళ్లింది ఆయన భార్య హెల్త్​చెకప్​కోసమేనని వ్యాఖ్యానించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమీక్ష అనంతరం గురువారం కిషన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో తనకు ఎవరూ ఫోన్ చేయలేదని, తన సహకారం అడగలేదని తెలిపారు. కేంద్రం మెడలు వంచుతాం, అగ్గి పెడతా అని ఢిల్లీకి వెళ్లికి సీఎం బీజేపీని ప్రశ్నించేందుకు ఏమీ లేక తన సొంత పనులు మాత్రమే చూసుకొని వచ్చారని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నప్పుడు ఆ పథకాలకు ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టడంలేదో సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. రాష్ట్ర అధికారులు మోడీ ఫోటో పెట్టకపోవడానికి కారణం రాజకీయ ఒత్తిళ్లేనని తను భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కేసీఆర్​ప్రభుత్వం ఉండేది మరో రెండేళ్లేనని, తర్వాత రాబోయేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది నిజం కాదా చెప్పాలని కిషన్​రెడ్డి ప్రశ్నించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..