ప్లాస్టిక్ రహిత పిలుపు పనిచేస్తోంది

by Shyam |

<p>దిశ, సిద్దిపేట: సిద్ధిపేట జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు స్థానిక మంత్రి హరీష్ రావు ఇచ్చిన పిలుపు పనిచేస్తోంది. ముందుగా ప్రజలు, వ్యాపారుల్లో మార్పు కనిపిస్తోందని స్థానికుల సమాచారం. హోటల్స్, టిఫిన్ సెంటర్‌లకు వెళ్లే ప్రజలు స్వచ్ఛందంగా బట్ట సంచులు తీసుకెళ్లి అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 5వ వార్డు కౌన్సిలర్ స్వప్న బ్రహ్మం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ..ఉదయాన్నే హోటల్స్ వద్ద ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పిస్తున్నారు. నెమ్మదిగా ప్రతి [&hellip;]</p>

ప్లాస్టిక్ రహిత పిలుపు పనిచేస్తోంది
X

దిశ, సిద్దిపేట: సిద్ధిపేట జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు స్థానిక మంత్రి హరీష్ రావు ఇచ్చిన పిలుపు పనిచేస్తోంది. ముందుగా ప్రజలు, వ్యాపారుల్లో మార్పు కనిపిస్తోందని స్థానికుల సమాచారం. హోటల్స్, టిఫిన్ సెంటర్‌లకు వెళ్లే ప్రజలు స్వచ్ఛందంగా బట్ట సంచులు తీసుకెళ్లి అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 5వ వార్డు కౌన్సిలర్ స్వప్న బ్రహ్మం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ..ఉదయాన్నే హోటల్స్ వద్ద ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పిస్తున్నారు. నెమ్మదిగా ప్రతి వార్డులోని కిరణా షాప్స్, హోటల్స్, కూరగాయాల వ్యాపారులు కూడా బట్ట సంచులు వాడాలని తమ కస్టమర్లకు చైతన్యం కల్పిస్తున్నారు. సిద్ధిపేటను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలని మంత్రి హరీష్ ఆకాక్షించారని, ఈ మేరకు ప్రజలు కృషి చేయడం మంచి పరిణామం అని స్థానిక కౌన్సిలర్ తెలిపారు.

Next Story