పదవి నుంచి తొలగించాక కిరణ్ బేడీ ట్వీట్.. ఏమన్నారంటే

by Shamantha N |

<p>దిశ,వెబ్‌డెస్క్: లెఫ్టినెంట్ గవర్నర్ పదవి తనకు సంతృప్తిని ఇచ్చిందని కిరణ్ బేడి అన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి మంగళవారం రాత్రి ప్రకటన వెలుపడింది. అనంతరం ఆమె ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తనకు అవకాశం ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నించానని చెప్పారు. పుదుచ్చేరికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం రాజ్ [&hellip;]</p>

పదవి నుంచి తొలగించాక కిరణ్ బేడీ ట్వీట్.. ఏమన్నారంటే
X

దిశ,వెబ్‌డెస్క్: లెఫ్టినెంట్ గవర్నర్ పదవి తనకు సంతృప్తిని ఇచ్చిందని కిరణ్ బేడి అన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి మంగళవారం రాత్రి ప్రకటన వెలుపడింది. అనంతరం ఆమె ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తనకు అవకాశం ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నించానని చెప్పారు. పుదుచ్చేరికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం రాజ్ నివాస్ టీమ్‌ శ్రద్దగా అధ్బుతంగా పని చేసిందని అన్నారు.

Next Story