ఉత్కంఠ పోరులో పంజాబ్ విన్

10

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 31వ మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. చావోరేవో అంటూ ఆడిన పంజాబ్ 8 వికెట్ల భారీ తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ 13 సీజన్‌లో ఉనికిని నిలుపుకుంది.

పంజాబ్ ఇన్నింగ్స్:
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాట్స్‌మెన్లు బెంగళూరుకు చుక్కలు చూపించారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్షర్లతో అద్భుత్ ఇన్నింగ్ ఆడి పెవిలియన్ చేరాడు.

ఇక అప్పటికే క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్‌కి యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. మరోసారి గేల్ విశ్వ రూపం చూపిస్తూ సిక్సర్ల మోత మోగించాడు. తొలుత తడబడ్డా గేల్ డేత్ ఓవర్ల సమీపంలో బ్యాటుకు పని చెప్పాడు. ఇక డేత్ ఓవర్లలోనే బెంగళూరు బౌలర్లు బ్యాట్స్‌మెన్ల పై ఒత్తిడి తెచ్చారు.

క్రీజులో కుదురుకున్న గేల్ 45 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో చెలరేగినా.. 53 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. కేఎల్ రాహల్ ఓపెనింగ్ నుంచి సమిష్ఠిగా రాణిస్తూ.. 49 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు కొట్టి 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయినా.. చివరి రెండో బంతికి గేల్ రనౌట్ కావడంతో పంజాబ్ విజయానికి మరో పరుగు కావాల్సి ఉంది. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన నికోలస్ పూరన్ చివరి బంతికి ఒక పరుగు చేయాల్సి ఉండగా.. భారీ సిక్స్ కొట్టి పంజాబ్‌ను గెలిపించాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి పంజాబ్ 177 పరుగులు చేసి విజయం సాధించింది.

బెంగళూరు ఇన్నింగ్స్:
టాస్ గెలిచి బ్యాటింగ్‌ దిగిన బెంగళూరు పర్వాలేదనిపించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్(20), పడిక్కల్(18) పరుగులకే వెనుదిరిగిన కెప్టెన్ కోహ్లీ(48) స్కోర్‌తో రాణించాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన వాషింగ్టన్ సుందర్(13), శివం దూబే(23) రన్స్‌ చేసి ఔట్ అయ్యారు.

బెంగళూరు తరఫున 6వ స్థానంలో వచ్చిన ఏబీ డివిలియర్స్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ(48) షమి ఓవర్‌లో షాట్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 18 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 137 పరుగులు చేసింది.

ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన క్రిస్ మోరిస్ బౌండరీలు పారించాడు. కేవలం 8 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 8వ స్థానంలో వచ్చిన ఇసురు ఉదాన 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ఆర్సీబీ 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

స్కోరు బోర్డు:
Royal Challengers Bangalore Innings: 171-6 (20 Ov)
1. ఆరోన్ ఫించ్ b మురుగన్ అశ్విన్ 20(18)
2. దేవదత్ పడిక్కల్ c పూరన్ b అర్ష్‌దీప్ సింగ్ 18(12)
3. విరాట్ కోహ్లీ(C) c రాహుల్ b షమి 48(39)
4. వాషింగ్టన్ సుందర్ c క్రిస్ జోర్డన్ b మురుగన్ అశ్విన్ 13(14)
5. శివం దూబే c రాహుల్ b క్రిస్ జోర్డన్ 23(19)
6. ఏబీ డివిలియర్స్ (wk) c దీపక్ హుడా b షమి 2(5)
7. క్రిస్ మోరిస్ నాటౌట్ 25(8)
8. ఇసురు ఉదాన నాటౌట్ 10(5)

ఎక్స్‌ట్రాలు: 12

మొత్తం స్కోరు: 171

వికెట్ల పతనం:38-1 (దేవదత్ పడిక్కల్, 4.1), 62-2 (ఆరోన్ ఫించ్, 6.3), 86-3 (వాషింగ్టన్ సుందర్, 10.3)
127-4 (శివం దూబే, 15.6), 134-5 (ఏబీ డివిలియర్స్, 17.3), 136-6 (విరాట్ కోహ్లీ, 17.5).

బౌలింగ్:
గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4-0-28-0
మహ్మద్ షమి 4-0-45-2
అర్ష్‌దీప్ సింగ్ 2-0-20-1
రవి భిష్నోయ్ 3-0-29-0
మురుగన్ అశ్విన్ 4-0-23-2
క్రిస్ జోర్డన్ 3-0-20-1

Kings XI Punjab Innings: 177-2 (20 Ov)

1. కేఎల్ రాహుల్ (c) (wk) నాటౌట్ 61(49)
2. మయాంక్ అగర్వాల్ b చాహల్ 45(25)
3. క్రిస్ గేల్ run out (దేవదత్ పడిక్కల్/డివిలియర్స్) 53(45)
4. నికోలస్ పూరన్ నాటౌట్ 6(1)

ఎక్స్‌ట్రాలు: 12

మొత్తం స్కోరు: 177/2

వికెట్ల పతనం: 78-1 (మయాంక్ అగర్వాల్, 7.6), 171-2 (క్రిస్ గేల్, 19.5)

బౌలింగ్:
క్రిస్ మోరిస్ 4-0-22-0
నవదీప్ సైని 4-0-21-0
యూజువేంద్ర చాహల్ 3-0-35-1
ఇసురు ఉదాన 2-0-14-0
మహ్మద్ సిరాజ్ 3-0-44-0
వాషింగ్టన్ సుందర్ 4-0-38-0