గేల్ బరిలోకి దిగాడు

7

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 31వ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. తొలుత ఓపెనింగ్ వచ్చిన మయాంక్(45) పరుగులు చేసి పెవిలియన్ చేరినా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. ఇటువంటి సమయంలో స్పిన్నర్ చాహల్ మయాంక్ అగర్వాల్‌ను క్లీన్ బోల్డ్ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన గేల్ ఆట బాల్ టు బాల్ ఉత్కంఠను రేపుతోంది. ఏ సమయంలో సిక్స్ కొడుతాడో.. ఏ సమయంలో వికెట్ వదిలేస్తాడో అన్న అంశం ఇరు జట్లలో మరింత ఆసక్తిని రేపుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 84/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్, గేల్ ఉన్నారు.