ఆయనలోని ఫినిషర్ అంటే నాకు చాలా ఇష్టం: కోహ్లీ

by  |
ఆయనలోని ఫినిషర్ అంటే నాకు చాలా ఇష్టం: కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను తన మెరుపు ఇన్నింగ్స్‌తో గెలిపించిన ఎంఎస్ ధోనిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ధోని బ్యాటింగ్ చేసిన విధానం చూసి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సంబర పడ్డాడు. ‘ధోనిలోని ఫినిషర్ అంటే నాకు చాా ఇష్టం. కింగ్ ఈజ్ బ్యాక్. అతడి బ్యాటింగ్ చూసి సీటులో నుంచి ఎగిరి గంతేశాను’ అని కోహ్లీ చెప్పాడు. ధోనీ ఫినిషింగ్ చూసి అనేక మంది మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపించారు. జడేజా మంచిగా ఆడుతున్నా.. మ్యాచ్ బాధ్యతలను తాను తీసుకొని ముందుకు వచ్చాడు.

అవసరమైన సమయంలో ఎలా బ్యాటింగ్ చేయాలో ధోనికి తెలుసు అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. చెన్నయ్ అద్భుత విజయం సాధించడంలో ధోనీ పాత్ర అమోఘం.. పులి ఇంకా బతికే ఉంది. రుతురాజ్ బ్యాటింగ్‌కు ఊతప్ప క్లాసిక్ ఇన్నింగ్స్ తోడైంది. ఇక ధోనీ ఎంత ముఖ్యమైన ఆటగాడో మరోసారి నిరూపించాడని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలిచి 9వ సారి ఫైనల్స్‌కు చేరుకున్నది.


Next Story

Most Viewed