ఆ ఫ్యాషన్ ఈవెంట్‌లో దెయ్యం.. ?

by  |
Met Gala 2021
X

దిశ, సినిమా : మోస్ట్ ఫ్యాషన్ ఈవెంట్ ‘మెట్ గాలా 2021’ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాషన్స్ బిగ్గెస్ట్ నైట్‌ గురించి సోషల్ మీడియాలో ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే స్టార్స్ లుక్స్ గురించి వస్తున్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కిమ్ కర్దాషియన్ లుక్ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. తను రెడ్ కార్పెట్‌పై దర్శనమిచ్చిన విధానం ఈవెంట్ ఫాలోవర్స్‌కు షాక్ ఇచ్చింది. టోటల్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో ఉన్న లుక్‌ మీమర్స్‌కు పని కల్పించింది. లాంగ్ పోనిటెయిల్‌, హీల్స్ ధరించిన కిమ్.. బాడీలో ప్రతీ ఇంచు కూడా బ్లాక్ డ్రెస్‌తో కవర్ చేసింది. కనీసం కళ్లు, ముక్కు దగ్గర కూడా ఎలాంటి స్లిట్స్ లేకపోవడం విశేషం. దీంతో మీమర్స్‌తో పాటు నెటిజన్లు కూడా జోక్‌లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కిమ్ లుక్‌పై స్పందించిన కరీనా కపూర్ ఖాన్.. ‘అసలు ఏం జరుగుతుంది?’ అని పోస్ట్ పెట్టింది. ఇది మెట్ గాలా 2021 ఫ్యాషన్ ఈవెంటేనా లేక మరేదైనానా? అనే సందేహం వ్యక్తం చేసింది.

కాగా ఈ లుక్ కిమ్ ఎక్స్‌ హజ్బెండ్ కాన్యే వెస్ట్ లేటెస్ట్ ఆల్బమ్ ‘డోండా’ నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యాషన్ సరిహద్దులను దాటేందుకు కాన్యే వెస్ట్ ఈ అవుట్ ఫిట్ సజెస్ట్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఈ లుక్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తనను హ్యారీపోర్టర్‌లోని డార్క్ క్రియేచర్ ‘డిమెంటర్‌’గా, దెయ్యంగా అభివర్ణిస్తూ కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed