- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హడలెత్తిస్తున్న ‘కిల్లర్ క్యాట్’..!
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కిల్లర్ క్యాట్… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులను హడలెత్తిస్తున్న పదం ఇది. పులి జాతుల్లో అరుదుగా ఉండే ఈ పెద్ద పులి మనుషులు లక్ష్యంగా వేట సాగిస్తుందన్న సమాచారం కలవరానికి గురిచేస్తోంది. కవ్వాల్ టైగర్ అభయారణ్యం ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో పులుల జాడ లేకుండా పోయింది. కానీ సాధారణ పెద్దపులులకు భిన్నంగా కిల్లర్ క్యాట్ జాతికి చెందిన పెద్దపులి ఇప్పుడు భీం జిల్లాలో తీవ్రంగా కలవరపెడుతోంది. మనుషులను చంపడమే ఈ టైగర్ […]</p>

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కిల్లర్ క్యాట్… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులను హడలెత్తిస్తున్న పదం ఇది. పులి జాతుల్లో అరుదుగా ఉండే ఈ పెద్ద పులి మనుషులు లక్ష్యంగా వేట సాగిస్తుందన్న సమాచారం కలవరానికి గురిచేస్తోంది. కవ్వాల్ టైగర్ అభయారణ్యం ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో పులుల జాడ లేకుండా పోయింది. కానీ సాధారణ పెద్దపులులకు భిన్నంగా కిల్లర్ క్యాట్ జాతికి చెందిన పెద్దపులి ఇప్పుడు భీం జిల్లాలో తీవ్రంగా కలవరపెడుతోంది.
మనుషులను చంపడమే ఈ టైగర్ టార్గెట్…
పెద్ద పులులు అడవి జంతువులతో పాటు పశువులను వేటాడుతాయి. కిల్లర్ క్యాట్ మాత్రం మనుషులను టార్గెట్ గా చేసుకొని వేటాడుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం కొమురం భీం జిల్లా లోని దహెగాం మండలం దిగుట గ్రామ అటవీ పొలిమేరల్లో సిడం విగ్నేష్ ను పెద్దపులి అడవిలోకి లాక్కెళ్లి సంహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అటవీశాఖ తో పాటు అన్ని వర్గాలను కలవరానికి గురి చేసింది. ఈ పెద్దపులి కిల్లర్ క్యాట్ జాతికి చెందినదిగా అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి పులులు పశువుల కాపరులను, పర్యాటకులను లక్ష్యంగా చేసి దాడులకు దిగుతాయని చెబుతున్నారు. గతంలో అస్సాంలోని జిమ్ కార్పెట్ టైగర్ రిజర్వ్ లో ఇద్దరు వ్యక్తులను పులి వేటాడే చంపింది. ఈ ఘటనలు చాలా కాలం క్రితం జరిగాయి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తో పాటు రాష్ట్రం లోనే వ్యక్తిని వేటాడిన పులి సంఘటన ఇదే మొదటిది కావడం గమనార్హం.
బోనుకు చిక్కడం అనుమానమే…
కిల్లర్ క్యాట్ అత్యంత తెలివైన పులిగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ యంత్రాంగం ఇటీవల దాడి చేసిన ప్రాంతంలో రహస్యంగా నాలుగు భారీ బోన్ల ను ఏర్పాటు చేసింది. వారం రోజులు గడుస్తున్నా పులి కాకపోవడం చూస్తే ఆ పులి ఖచ్చితంగా కిల్లర్ క్యాట్ కావచ్చని అనుమానిస్తున్నారు.
ఆకలి, భయం రెండూ కావచ్చు..
అడవిలో ఉండే పులులు సాధారణ జీవజాతుల మాదిరిగానే ఆకలి కోసం వేటాడుతాయి. కొమురం భీం జిల్లాలో జరిగిన సంఘటన అందులో భాగమే కావచ్చు. కొన్నిసార్లు మనుషులను చూసి భయపడి ఆత్మరక్షణలో పడి దాడిచేస్తాయి. కవ్వాల్ అభయారణ్యం లోనూ పులుల సంచారం పెరిగింది. కిల్లర్ క్యాట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -కోటేశ్వరరావు, ఎఫ్డీఓ, ఖానాపూర్






