నిజామాబాద్‌: బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్లు ఎక్కడ..?

by Batti.Sumithra |

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్‌ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి అస్కియా హనీ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం పేరెంట్స్‌తో పాటు షాపింగ్‌కు వచ్చిన హనీని ఓ మహిళ ఎత్తుకెళ్లింది. వెంటనే అప్రమత్తమై బాధిత తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. చిన్నారిని ఆటోలో బోధన్ వరకు తీసుకెళ్లినట్టు తొలుత సీసీ టీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే [&hellip;]</p>

నిజామాబాద్‌: బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. కిడ్నాపర్లు ఎక్కడ..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్‌ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో కిడ్నాప్‌కు గురైన చిన్నారి అస్కియా హనీ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం పేరెంట్స్‌తో పాటు షాపింగ్‌కు వచ్చిన హనీని ఓ మహిళ ఎత్తుకెళ్లింది. వెంటనే అప్రమత్తమై బాధిత తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. చిన్నారిని ఆటోలో బోధన్ వరకు తీసుకెళ్లినట్టు తొలుత సీసీ టీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాందేడ్ జిల్లా నర్సీ వద్ద అస్కియా హనీని గుర్తించారు.

నిజామాబాద్ జిల్లాకు చిన్నారిని తరలిస్తున్నారు. కాగా, పాప కిడ్నాప్‌కు గురై 24 గంటలు దాటినా కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో పోలీసు శాఖ రూ. 50 వేల రివార్డు కూడా ప్రకటించింది. కాగా, శనివారమే నర్సీలో కిడ్నాపర్‌ను‌ పట్టుకున్నట్టు ప్రచారం జరిగినా.. పోలీసులు ధృవీకరించలేదు. కానీ, బాలికను కిడ్నాపర్‌లు వదలివెళ్లినట్టు తెలియడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులకు పాపను చూపించి అస్కియాను ఐడెంటీఫై. చేశారు. చిన్నారిని నిజామాబాద్‌కు తీసుకొచ్చిన అనంతరం ప్రెస్‌మీట్‌లో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు పోలీసులు.

Next Story