- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వద్దు బావా ప్లీజ్.. తప్పు బావా.. అని బతిమాలినా వదల్లేదు
<p> వద్దు బావా ప్లీజ్.. తప్పు బావా… నాకు ఇష్టం లేదు అని ఎంత బతిమాలినా వదలని యువకుడు మరదిలి మెళ్లో మూడుముళ్లు వేసి కసి తీర్చుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోకి హసన్ జిల్లాలో హసన్ డైరీ సమీపంలో నివాసముండే యువతి (23)ని వరుసకు బావ (30) అయ్యే వ్యక్తి ప్రేమిస్తున్నాడు. ఏడాది కాలంగా తనను వివాహం చేసుకోవాలని వెంటపడుతున్నాడు. ఆమె మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. […]</p>

వద్దు బావా ప్లీజ్.. తప్పు బావా… నాకు ఇష్టం లేదు అని ఎంత బతిమాలినా వదలని యువకుడు మరదిలి మెళ్లో మూడుముళ్లు వేసి కసి తీర్చుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోకి హసన్ జిల్లాలో హసన్ డైరీ సమీపంలో నివాసముండే యువతి (23)ని వరుసకు బావ (30) అయ్యే వ్యక్తి ప్రేమిస్తున్నాడు. ఏడాది కాలంగా తనను వివాహం చేసుకోవాలని వెంటపడుతున్నాడు. ఆమె మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది.
ఆఖరుకి ఆమె తల్లిదండ్రులను కూడా కలిశాడు. వారుకూడా కుమార్తె నిర్ణయానికే మద్దతు పలికారు. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించిన మను.. హసన్ డైరీ బస్‌స్టాప్‌లో యువతి ఎదురుచూస్తున్న సమయంలో స్నేహితులతో కలిసి కారులో అక్కడికి చేరుకున్నాడు. అందరూ చూస్తుండగానే బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించాడు. అనంతరం మను కారులో ఆమె ఎంత పెనుగులాడినా, బతిమాలినా పట్టించుకోకుండా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు.
అనంతరం తన స్నేహితుడి వద్ద యువతిని దాచిపెట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె తండ్రి మనస్తాపానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వారి చెర నుంచి కాపాడారు.






