వారే నా సోల్ మేట్స్ : కియారా

by  |
వారే నా సోల్ మేట్స్ :  కియారా
X

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అందానికి ఇండియా మొత్తం ఫిదా అయింది. ఒక్కో సినిమాకు మరింత అందంగా మారి.. సరి కొత్త లుక్స్‌తో మెప్పిస్తున్న ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్‌లో ఉంది. కోట్లలో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న కియారా.. తను మాత్రం ముగ్గురికి వీరాభిమాని అని చెప్తోంది. కానీ వాళ్లు నటులో, క్రికెటర్లో కాదు.. బెస్ట్ ఫ్రెండ్స్ అంట.

లాక్‌డౌన్ కారణంగా తన గర్ల్ ఫ్రెండ్స్‌ను మిస్ అవుతున్నట్లు చెప్పిన కియారా.. ఇప్పుడే కార్‌లో హై స్పీడ్‌లో వెళ్లి వాళ్లను చూడాలనిపిస్తోందని చెప్పింది. కానీ కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితులే తనను ఆపుతున్నాయంది. ప్రతీ రోజును మరింత స్పెషల్‌గా మార్చే తన బ్యూటిఫుల్ ఫ్రెండ్స్‌కు ఇది అప్రిషియేషన్ పోస్ట్ అని తెలుపుతూ.. వారితో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ షేర్ చేసింది. ‘స్కూల్‌లో కలిసి చదువుకున్న మేము.. కాలేజ్ వరకు కలిసే ఉన్నాం. వాళ్ల ముగ్గురికి పెళ్లిళై, వేరు వేరు దేశాల్లో ఉంటున్నా సరే.. మేమందరం సోల్ మేట్స్. ఒకరితో ఒకరు షేర్ చేసుకోలేనిది బహుశా లేదేమో’ అంటోంది కియారా.

https://www.instagram.com/p/CB4t2zsJyo9/?utm_source=ig_web_copy_link

Next Story