- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంగార్డ్‌తో ఆ సంబంధం ఉందని వివాహితని.. అలా చేశారు
<p>దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఐదు నిమిషాల సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మరికొంతమంది ఈ మృగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఒక మహిళ, హోమ్ గార్డుతో సంబంధం పెట్టుకోందని అనుమానించిన కుటుంబ సభ్యులు ఆమెను కిటికీ కి కట్టి కొట్టిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్ కి చెందిన నరేష్ హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లయి, […]</p>

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. ఐదు నిమిషాల సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మరికొంతమంది ఈ మృగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఒక మహిళ, హోమ్ గార్డుతో సంబంధం పెట్టుకోందని అనుమానించిన కుటుంబ సభ్యులు ఆమెను కిటికీ కి కట్టి కొట్టిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్ కి చెందిన నరేష్ హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో నరేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నరేష్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో ఆదివారం నరేష్, మహిళ మాట్లాడుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మహిళను చితకొట్టారు. ఆమె ఇంటి కిటికీకి చేతులు కట్టేసి దారుణంగా దాడి చేశారు. అయితే ఆ మహిళ, నరేష్ కి తనకి ఏ సంబంధం లేదని, తన దగ్గర నుండి అతను కొంతమందికి డబ్బులు ఇప్పించాడని, ఆ డబ్బులు గురుంచి మాట్లాడడానికి ఇంటికి వచ్చాడని తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని గొడవను సద్దుమణిగించారు






