ఖమ్మం బాలిక విషయంలో.. పోలీసుల అత్యుత్సాహం

1

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగరంలో అమానుషానికి గురైన పదమూడేళ్ల బాలిక మోతె నర్సమ్మ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ.. మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మైనర్ బలిక ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కుటుంబసభ్యులు లేకుండానే హడావుడిగా పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం హుటాహుటిన ఉస్మానియా మార్చురీ నుంచి మృతదేహాన్ని తరలించారు. దీంతో పోలీసుల తీరుపై మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.