ఖమ్మంలో అబ్కారీ శాఖకు కాసుల పంట.. ఇక వీదికొక లిక్కర్ షాప్ ?

by  |
ఖమ్మంలో అబ్కారీ శాఖకు కాసుల పంట.. ఇక వీదికొక లిక్కర్ షాప్ ?
X

దిశ‌, ఖ‌మ్మం: రాష్ట్ర వ్యాప్తంగా నూత‌న మ‌ద్యం పాల‌సీని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న ఖ‌రారు చేసింది. నూత‌న మ‌ద్యం దుకాణాల‌కు ఈ నెల 8 వ తేదీ నుంచి గురువారం వరకు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు. చివ‌రి రోజున ద‌ర‌ఖాస్తుదారులు పోటెత్తడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా 83 మ‌ద్యం దుక‌ణాలు ఉండ‌గా కొత్తగా 39 దుకాణాల‌ ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో జిల్లాలోని 122 దుకాణాల‌కు మొత్తం 6050 ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు.

ఖ‌మ్మం జిల్లాలో చివ‌రి రోజున 2140 ద‌ర‌ఖాస్తులు దాఖలు అయ్యాయి. ద‌ర‌ఖాస్తుల రూపంలో ఎక్సైజ్ ఖజానాకు రూ.121 కోట్లు ఆదాయం చేకూరింది. గ‌తంలో 83 షాపుల‌కు 4303 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఈ సారి కొత్తగా వ‌చ్చిన షాపుల‌తో పాటు ప్రభుత్వం క‌మీష‌న్ ఎక్కవ‌గా ఇస్తున్న నేప‌థ్యంలో చాలా షాపులు ద‌క్కించుకున్నేందుకు ఆస్తకి చూపుతున్నారు వ్యాపారులు. ద‌ర‌ఖాస్తు రుసుము రూ.2 ల‌క్షలు ఉన్నా కూడా మ‌ద్యం వ్యాపార‌స్తుల‌లో కొత్త వారు ముందుకు వ‌స్తున్నారు.

భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల‌సీలో 76 మ‌ద్యం షాపులు ఉండేవి. నూత‌న పాల‌సీలో అద‌నంగా 12 షాపులు కేటాయించారు. మొత్తం 88 షాపుల‌కు 1799 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 88 షాపుల్లో 44 గిరిజ‌నుల‌కు రిజ‌ర్వ్ చేశారు. మిగ‌తా వాటిలో ఏడు ఎస్సీల‌కు, 6 గౌడ‌కు రిజ‌ర్వ్ చేశారు. మిగితా 31 దుకాణాలు జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. ఖ‌మ్మం జిల్లాలోని మ‌ధిర ప్రాంతం లోని 20 షాపుల‌కు 1255 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. రెండో స్థానంలో స‌త్తుప‌ల్లి ప్రాంతంలో 23 షాపుల‌కు 1253 ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేశారు. అతిత‌క్కవ‌గా సింగ‌రేణి ప్రాంతంలో ఉన్న 10 షాపుల‌కు 337 ద‌ర‌ఖాస్తు వ‌చ్చిన్నట్లు అధికారులు తెలిపారు.

ఖ‌మ్మం జిల్లాలోని దుకాణాల‌కు ఈ నెల 20 వ తేదీన ఖ‌మ్మం సీక్వెల్ రిసార్ట్స్‌లో లాట‌రీ ప్రక్రియ‌ను నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లా క‌లెక్టర్ లాట‌రీ ప్రక్రియ‌ను ప్రారంభిస్తారు. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షాపుల‌కు కొత్తగూడెం క్లబ్‌లో లాట‌రీ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ జిల్లా క‌లెక్టర్ లాట‌రీ ప్రక్రియ‌ను ప్రారంభించ‌నున్నారు.


Next Story

Most Viewed