నాలుగేళ్లుగా ‘రాఖీ భాయ్‌’గానే జీవిస్తున్నా : యశ్

by  |
నాలుగేళ్లుగా ‘రాఖీ భాయ్‌’గానే జీవిస్తున్నా : యశ్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో యశ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 1’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక గురువారం రిలీజైన ‘కేజీఎఫ్ 2’ టీజర్‌తో హాలీవుడ్ స్టార్‌లా కనిపిస్తున్నాడంటూ ప్రశంసలు అందుకున్నాడు. చాప్టర్ 1తో యశ్ కెరియర్ మారిపోగా.. చాప్టర్ 2తో ఇండియన్ సినిమా సూపర్ స్టార్ అయిపోతాడంటున్నారు ఫ్యాన్స్. మరి ‘కేజీఎఫ్ 1’ నుంచి ‘కేజీఎఫ్ 2’ వరకు తన ప్రయాణం ఎలా సాగింది? బాలీవుడ్ స్టార్స్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అనే విషయాల గురించి రాఖీ భాయ్ మాటల్లో..

‘కేజీఎఫ్‌ 1’ సెన్సేషనల్‌ హిట్‌.. ‘కేజీఎఫ్‌ 2’ కూడా అలాంటి రికార్డులను క్రియేట్‌ చేస్తుందా?
‘కేజీఎఫ్‌ 1’ స్టార్ట్‌ చేసే ముందు చాలా పరిమితులుండేవి. కానీ ఒక బెస్ట్ మూవీని ప్రేక్షకులకు అందించాలనే తపనతో టీమ్ అంతా చాలా కష్టపడింది. ఫలితంగా ఆడియన్స్ నుంచి బిగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’పై చాలా అంచనాలున్నాయి. అందుకే టీమ్‌ అందరం ఇంకా ఎక్కువ కష్టపడ్డాం. బిగ్‌ స్కేల్‌లో సినిమాను తీర్చిదిద్దాం. ఇంత కష్టపడటానికి కారణం.. ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్‌ చేసేలా ఓ సినిమాను రూపొందించడమే. ఈ ప్రాసెస్‌లో రికార్డులు బ్రేక్‌ చేయడం అంటే బోనస్‌ అనే చెప్పాలి.

‘కేజీఎఫ్‌’ రెండు భాగాలకు గల తేడా?
‘కేజీఎఫ్‌ 1’లో రాఖీ భాయ్‌ పాత్రను పరిచయం చేశాం. తన వ్యక్తిత్వం, ఎక్కడి నుంచి వచ్చాడు? తన ముందున్న లక్ష్యాలేంటి? రాక్షసులను దాటి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేది చూపించాం. చాప్టర్ 2లో రాఖీలో కొత్త కోణాలను ఆవిష్కరించబోతున్నాం. చాప్టర్ 1 కన్నా చాప్టర్ 2 చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కూడా అమేజింగ్‌గా ఉంటాయి.

‘కేజీఎఫ్‌ 2’లో సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారా?
హా.. బట్ ఇప్పుడే చెప్పలేం.

సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?
అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌. సంజయ్‌ దత్‌ ఆరోగ్యం బాగా లేకపోయినా సినిమా కోసం వర్క్ చేశారు. సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్‌ ఇన్‌స్పైర్ చేసింది. రవీనా టాండన్‌ విలక్షణ నటి. టీమ్‌లోకి ఎంటర్ అవగానే తన పవర్‌ను అందిరికీ అందించింది.

‘కేజీఎఫ్‌ 2’ కోసం స్పెషల్ ప్రిపరేషన్స్ ఉన్నాయా?
ఈ పాత్రలోనే దాదాపు నాలుగేళ్లుగా ఉన్నా. సో.. నేచురల్‌గానే యాక్ట్ చేశాను.

షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుంది?
వన్ డే ప్యాచ్‌ వర్క్‌ మినహా అంతా పూర్తైంది.

‘కేజీఎఫ్‌ 2’లో చాలెంజింగ్‌గా అనిపించిన సన్నివేశాలు?
చాలా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక మీకు ఆన్సర్ దొరుకుతుంది.


Next Story

Most Viewed