మాన్సాస్ ట్రస్ట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్‌కు దెబ్బే

by  |
మాన్సాస్ ట్రస్ట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్‌కు దెబ్బే
X

దిశ, ఏపీ బ్యూరో: మాన్సాస్ ట్రస్ట్ వారసత్వంపై హైకోర్టు కీలక తీర్పువెల్లడించింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజునే కొనసాగించాలని ఆదేశించింది. బుధవారం మాన్సాస్ ట్రస్ట్ వారసత్వం పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వలు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ బెంచ్‌ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం, సంచయిత, ఊర్మిళలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. ఇకపోతే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయిత గజపతి నియామకం చెల్లదని తిరిగి అశోక్‌గజపతిరాజునే చైర్మన్‌గా కొనసాగించాలని సింగిల్ బెంచ్ తీర్పు వెల్లడించింది.

అయితే నిబంధనల ప్రకారమే ట్రస్ట్‌ చైర్మన్‌గా సంచయితను నియమించామని ప్రభుత్వం తెలిపింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అశోక్ గజపతి రాజును చైర్మన్‌గా నిర్ధారించిన సింగిల్ బెంచ్ ఆదేశాలను రద్దు చేయాలని కోరింది. మరోవైపు మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌గా తనను గుర్తించాలని ఊర్మిళ గజపతి సైతం హైకోర్టును ఆశ్రయించింది.

ఆనంద గజపతిరాజు రెండవ భార్య కుమార్తెగా తనకు హక్కు ఉందని తెలిపిందామె. దీంతో ట్రస్ట్‌ వారసత్వంపై త్రిముఖ పోటీ నెలకొంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బుధవారం హైకోర్టు అశోక్‌గజపతిరాజునే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా కొనసాగించాలని ఆదేశించింది. అలాగే ప్రభుత్వం, సంచయిత, ఊర్మిళలు వేసిన పిటిషన్లను కొట్టేసింది. హైకోర్టు తీర్పుపట్ల తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story