‘కింది బెర్త్‌లు వాళ్లకే కేటాయించండి’

by  |
‘కింది బెర్త్‌లు వాళ్లకే కేటాయించండి’
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రైన్ బెర్తుల‌పై మధ్య ప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోవర్‌ బెర్తుల కేటాయింపులో వీవీఐపీలకే తొలి ప్రాధాన్యత పొందే వ్యవస్థను తీవ్రంగా తప్పబట్టింది. ఆ స్థానంలో గర్బిణీలు, దివ్యాంగులు, రోగులకే కింది బెర్త్‌లను ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే దాఖలైన ఓ పిటిషన్‌ను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. గురువారం విచారణ జరిపి తీర్పు వెల్లడించింది. పై బెర్తుల్లో ప్రయాణించేందుకు(ఎక్కి, దిగేందుకు) గర్బణీలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బంది పడుతారని నొక్కి చెప్పింది. దీంతో లోవర్ బెర్తులను వారికే కేటాయించాలని తేల్చి చెప్పింది. పరిస్థితులను బట్టి ప్రయాణికులు ఆయా బెర్తులను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాలని సూచించింది.


Next Story