సిక్స్ కొట్టినందుకు కారు అద్దాలు ధ్వంసం

by  |
సిక్స్ కొట్టినందుకు కారు అద్దాలు ధ్వంసం
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో సిక్సులు, ఫోర్లు బాదే బ్యాట్స్‌మెన్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. వాళ్లు కొట్టే బంతులను గ్యాలరీల్లోకి పంపుతూ, స్టేడియంలో దాటిస్తుంటే స్టేడియంలో ఒకటే సందడి. కొన్ని సార్లు బ్యాట్స్‌మెన్ బలంగా బాదే బంతుల వల్ల స్టేడియంలో ప్రేక్షకులకు గాయాలవడం, గ్యాలరీల్లో అద్దాలు పగలడం చూస్తూనే ఉంటాం.

అయితే, తాజాగా ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ ఓబ్రియన్ కొట్టిన బంతి ఎక్కడ పడిందో తెలుసుకొని ఏకంగా ఆ బ్యాట్స్‌మెన్ ఆశ్చర్యపోయాడు. ఐర్లాండ్‌లో ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 కప్ టోర్నీ జరుగుతున్నది. గురువారం డబ్లిన్‌లో నార్త్ వెస్ట్ వారియర్స్, లీన్‌స్టర్ లైటనింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన లీన్‌స్టర్ జట్టులో ఓపెనర్ గా వచ్చిన ఓబ్రెయిన్ కేవలం 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు.

తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. అయితే కెవిన్ కొట్టిన ఒక సిక్స్ స్టేడియం బయట ఉన్న ఒక కారు అద్దాలను ధ్వంసం చేసింది. పాపం ఎవరో ప్రేక్షకుడు బలయిపోయాడని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే అది సిక్స్ కొట్టిన కెవిన్ కారే కావడం గమనార్హం. దీనికి ఇన్స్యూరెన్స్ ఉండటంతో టొయోటా షోరూంకి తీసుకెళ్లి రిపేర్ చేయించాడు. ఈ ఫొటోలను టొయోటో కంపెనీనే షేర్ చేసింది.

Next Story

Most Viewed