కేవలం హామీలకే పరిమితమైన ముఖ్యమంత్రి

by Shyam |   (  Updated:2021-09-06 05:37:23  IST  )

<p>దిశ, షాద్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం హామీలకే పరిమితం అయ్యారని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడ వీరేష్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప తహసీల్దార్ ప్రసన్న లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా వీరేష్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళిత, గిరిజనులకు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. దళితులకు మూడెకరాల [&hellip;]</p>

Keshampet Congress leaders
X

దిశ, షాద్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం హామీలకే పరిమితం అయ్యారని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడ వీరేష్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప తహసీల్దార్ ప్రసన్న లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా వీరేష్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళిత, గిరిజనులకు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా అనేక హామీలు ఇచ్చి, ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణలో ‘దళితబంధు’తో పాటు ‘గిరిజనబంధు’ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీశ్వర్, రావుల పెంటయ్య, తుమ్మల గోపాల్, కోడూరు రాములు, యారం భాస్కర్ రెడ్డి, సాజిద్, నర్సింహులు, జంగయ్య, శ్రీనివాస్ గౌడ్, సాయిలు, రమేష్ పాల్గొన్నారు.

Next Story