కరోనా జాగ్రత్తలు : అదిరిపోయే స్టెప్పులతో పోలీసుల అవగాహన

by  |
కరోనా జాగ్రత్తలు :  అదిరిపోయే స్టెప్పులతో పోలీసుల అవగాహన
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా దేశంలో విలయ తాండవం చేస్తుంది. రోజురోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో దేశం అతలాకుతలం అవుతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు చేపడుతుంది. పోలీసులు, డాక్టర్లు ఈ కష్టకాలంలో ప్రజలకు కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమో తెలుపుతూ ఎన్నో అవహగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోలీసులు అందర్నీ అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా కేరళ పోలీసులు విన్నూత రీతిలో కరోనా వైరస్ పై అవగాహన తెలుపుతున్నారు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినా ‘ఎంజాయి.. ఎంజామి’ సాంగ్ ట్యూన్ కి కరోనా నిబంధనలను పేరడీ చేసి .. వాటికి తగినట్టు స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ పేరడీ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

కరోనా వేళ జాగ్రత్తలు తీసుకోండి.. మాస్కులను తప్పకుండ ధరించండి.. సమాజానికో, పోలీసులకో భయపడి మాస్క్ పెట్టుకోకుండా.. మాస్క్ ని మీ ఆరోగ్యం కోసం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్ వెంట తీసుకెళ్లండి.. కరోనాను తగ్గించడానికి టీకా వస్తుంది. టీకాను అందరు తప్పకుండా వేసుకోండి.. అందరు కలిసి కరోనా లేని భవిష్యత్తు కోసం పోరాడదాం.. అంటూ పోలీసులు వేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది.



Next Story