దేశాన్ని వణికిస్తున్న కేరళా కేసులు .. ఎందుకంటే

by  |
corona
X

దిశ వెబ్ డెస్క్ : దేశంలో సెకెండ్ వేవ్ తర్వాత కేసుల సంఖ్యలో గణనీయమైన మార్పులే కనిపించాయి. అయితే దేశంలోని చాలా రాష్ట్రాల్లో కేసులు కంట్రోల్ లోకి వస్తుంటే ఒక్క కేరళలో మాత్రం అదుపులోకి రావడం లేదు. దేశంలో నమోదు అయ్యే సగం పైగా కేసులు ఒక్క కేరళలోనే నమోదు అవుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రోజుకు వేలల్లో కొత్త కేసులు నమోదు అవుతుండటంతో కేరళ చిగురుటాకులా వణుకుతోంది. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 25,010 కరోనా కేసులు నమోదు కాగా, 177 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 2.37 లక్షల కరోనా యాక్టీవ్ కేసులు ఉండగా.. పాజిటివిటీ రేటు 16.53 శాతంగా వుంది.

కరోనా సెకండ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు వ్యాక్సిన్‌ ఒకటే ప్రధాన అస్త్రమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే కోవిడ్‌ మ‌ర‌ణాల‌ను నివారించ‌డంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా ప‌ని చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ సింగిల్ డోస్‌తో 96.6 శాతం, రెండు డోస్‌తో 97.5 శాతం మ‌ర‌ణాల‌ను నివారించవచ్చని కేంద్రం వెల్లడించింది. అయితే కేరళలో పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ కు సూచన వావచ్చు అని కొందరి నిపుణుల అభిప్రాయం.


Next Story