టాప్ యూట్యూబర్స్ లిస్ట్‌లో అనిల్ జీలా.. కేరళ ప్రభుత్వ ఆహ్వానం

by  |
టాప్ యూట్యూబర్స్ లిస్ట్‌లో అనిల్ జీలా.. కేరళ ప్రభుత్వ ఆహ్వానం
X

దిశ, సినిమా : ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానల్ ద్వారా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు అనిల్ జీలా. ఆ తర్వాత ‘అనిల్ జీలా వ్లోగ్స్’ పేరుతో పలు ప్రాంతాల విశిష్టతను తెలుపుతూ వీడియోలు చేయడం ప్రారంభించాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనిల్ వ్లోగ్ ఈ మధ్య పాపులర్ కాగా.. తనను అప్రిషియేట్ చేస్తూ కేరళ ప్రభుత్వ టూరిజం శాఖ ఆహ్వానం అందించింది. కేరళ అందాలను వీడియోలో బంధిస్తూ వ్లోగ్స్ చేయాలని.. కేరళ పర్యాటక ప్రాంత విశిష్టతను ప్రపంచవ్యాప్తం చేయాలని కోరింది. ఇందుకోసం అనిల్‌తో పాటు దేశంలోని మరో పది మంది ఉత్తమ యూట్యూబర్స్‌ను సెలెక్ట్ చేసింది. కాగా అనిల్ సిద్దిపేట జిల్లా నంగునూర్‌ మండలం దర్గపల్లికి చెందినవాడు కాగా.. ప్రస్తుతం సినిమాల్లోనూ సపోర్టెడ్ క్యారెక్టర్స్‌తో కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నాడు అనిల్.



Next Story