మహేశ్ మూవీలో మహానటి ప్రయోగం.. సీక్రెట్ రివీల్ చేసిన థమన్

by  |
మహేశ్ మూవీలో మహానటి ప్రయోగం.. సీక్రెట్ రివీల్ చేసిన థమన్
X

దిశ, సినిమా: యాక్టర్స్ ప్రస్తుతం నటనకే పరిమితం కావడం లేదు. సింగింగ్, డ్యాన్సింగ్ వంటి మల్టీపుల్ టాలెంట్స్‌తో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు తమ సినిమాల్లో గొంతు సవరించుకున్న విషయం తెలిసిందే. ఏదైనా పాటకు వారి వాయిస్ సూట్ అవుతుందని భావిస్తే మ్యూజిక్ డైరెక్టర్లు పట్టుబట్టి మరీ హీరోలు, హీరోయిన్లతో పాడిస్తున్నారు. తాజాగా ‘మహానటి’ కీర్తి సురేష్ సైతం ఈ జాబితాలో చేరిపోయింది. మహేశ్ హీరోగా పరశురాం డైరెక్షన్‌లో వస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి న్యూ రోల్ పోషిస్తోందని.. ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సీక్రెట్‌ రివీల్ చేశాడు.

ఈ సినిమాలో కీర్తి ఏదైనా పాట పాడుతోందా? అని అడిగితే.. వయొలిన్ ప్లే చేస్తుందని సమాధానమిచ్చాడు థమన్. నిజానికి తను టాలెంటెడ్ వయొలిన్ ప్లేయర్ కాగా.. గతంలో విజయ్ ‘కుట్టీ’ స్టోరీ సాంగ్‌ను వయొలిన్‌‌పై ప్లే చేస్తూ బర్త్ డే విషెస్ అందించింది. ఈ పర్ఫార్మెన్స్ అప్పట్లో వైరల్ కాగా.. ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ కీర్తి వయొలిన్ వాయించబోతుందని తెలిసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 1, 2002లో విడుదల కానుంది.



Next Story

Most Viewed