- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేజ డైరెక్షన్‌లో కీర్తి..
<p>మహానటిలో కీర్తి సురేశ్ నటనకు దేశం మొత్తం ఫిదా అయింది. ఆ సినిమాకు తను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత వచ్చిన పెంగ్విన్‌లోనూ కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో ఏదైనా నటనా ప్రాధాన్యమున్న పాత్ర ఉంటే చాలు..సౌత్ ఇండస్ట్రీలో కీర్తినే ఫస్ట్ చాయిస్ అయిపోయింది. ఇప్పటికే తెలుగులో మహేశ్ బాబు సర్కార్ వారి పాటలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన కీర్తి.. తాజాగా తేజ డైరెక్షన్‌లో వస్తున్న ‘అలివేలుమంగ వెంకటరమణ’ […]</p>

మహానటిలో కీర్తి సురేశ్ నటనకు దేశం మొత్తం ఫిదా అయింది. ఆ సినిమాకు తను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత వచ్చిన పెంగ్విన్‌లోనూ కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో ఏదైనా నటనా ప్రాధాన్యమున్న పాత్ర ఉంటే చాలు..సౌత్ ఇండస్ట్రీలో కీర్తినే ఫస్ట్ చాయిస్ అయిపోయింది. ఇప్పటికే తెలుగులో మహేశ్ బాబు సర్కార్ వారి పాటలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసిన కీర్తి.. తాజాగా తేజ డైరెక్షన్‌లో వస్తున్న ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో కథానాయికగా సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
యాక్షన్ హీరో గోపిచంద్‌కు.. తేజ ఇంతకు ముందే కథ వినిపించగా ఓకే చెప్పేశాడు. ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ వెంకటరమణగా నటిస్తుండగా.. అలివేలు మంగగా కీర్తి ఫైనల్ అయిందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నారట డైరెక్టర్ తేజ.
కాగా తెలుగులో కీర్తి ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాలో చేస్తుండగా.. గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయిన తర్వాత అలివేలు మంగ వెంకటరమణ షూటింగ్ షురూ కానుంది.






