మాస్టర్‌కు మహానటి విష్..

by  |
మాస్టర్‌కు మహానటి విష్..
X

ఇళయ దళపతి విజయ్‌కు తమిళనాట ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కష్టపడి సూపర్‌స్టార్‌గా ఎదిగిన విజయ్‌కు విజయాలు దాసోహం కాగా.. కీర్తి, ప్రతిష్టలు తన వాకిట వచ్చి చేరాయి. కోట్లాది అభిమానులచే ఆరాధించబడుతూ.. వారి హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. అయితే తనకు సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. తోటి నటీనటుల్లోనూ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. జూన్ 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా వారంతా విజయ్‌కు స్పెషల్ బర్త్‌డే విషెస్ అందించారు.

https://twitter.com/KeerthyOfficial/status/1275015107479695361?s=09

కాగా ఈ లిస్ట్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కూడా ఉంది. స్వతహాగా విజయ్‌కు వీరాభిమాని అయిన కీర్తి.. ఈ సందర్భంగా సర్‌ప్రైజ్ వీడియోను పోస్ట్ చేసింది. విజయ్ లేటెస్ట్ ఫిల్మ్ మాస్టర్‌లో ‘కుట్టి స్టోరీ’ సాంగ్ సూపర్ హిట్ కాగా.. ఈ పాటపై వయోలిన్ ప్లే చేస్తూ అభిమాన హీరోకి ఆ పాటను, తన టాలెంట్‌ను అంకితం చేసింది. దీంతో ఫ్యాన్ గర్ల్ కీర్తి.. విజయ్‌కు ఇచ్చిన బర్త్‌ డే గిఫ్ట్ వీర లెవల్లో ఉందని ప్రశంసిస్తున్నారు అభిమానులు. తనలో ఉన్న టాలెంట్‌కు ఖుదోస్ చెప్తూనే.. స్పెషల్ వీడియో అందించినందుకు థాంక్స్ చెప్తున్నారు.



Next Story

Most Viewed