- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్.. ప్రధాని మోడీకి లేఖ రాసిన కేసీఆర్
<p>దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని ఆ లేఖలో కోరారు. అంతేకాకుండా 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేఖలో కోరారు. అదేవిధంగా 2021-22 ఖరీఫ్‌లో కూడా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లేఖలో వచ్చే రబీలోనూ తెలంగాణ నుంచి ఎన్ని టన్నుల […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని ఆ లేఖలో కోరారు. అంతేకాకుండా 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేఖలో కోరారు. అదేవిధంగా 2021-22 ఖరీఫ్‌లో కూడా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా లేఖలో వచ్చే రబీలోనూ తెలంగాణ నుంచి ఎన్ని టన్నుల ధాన్యం కొంటారో తెలపాలంటూ ప్రధాని మోడీని కేసీఆర్ ప్రశ్నించారు. అయితే గురువారం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోడీకి లేఖ రాయడం పాధ్యానతను సంతరించుకుంది. ఈ లేఖపై కేంద్రం ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.








