సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఇంటెలిజెన్స్ నిఘా

by  |
సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఇంటెలిజెన్స్ నిఘా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై నిఘావర్గాలు నజర్‌ పెట్టాయి. ఎవరేం చేస్తున్నారు? ఏయే వ్యవహారాల్లో తల దూరుస్తున్నారో సమగ్ర వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని నిఘావర్గాలను కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. పార్టీ కేడర్‌తో ఎలా ఉంటున్నారు? కోటరీ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారా? ప్రభుత్వ పథకాలపై ఎలా ప్రచారం చేస్తున్నారు? అనే వివరాలు సైతం నిఘావర్గాల ద్వారా ఆరా తీస్తున్నారు.

ప్రధానంగా వివాహేతర సంబంధాలపై సమగ్రమైన వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కొంతమంది ప్రజా ప్రతినిధులు వివాహేతర బంధాలను పెట్టుకుంటున్నారన్న విమర్శలు ఇటీవల తీవ్రం కావడంతో ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీనికి ప్రత్యేకంగా ఫాంహౌజ్‌లు వినియోగించుకుంటున్నారన్న విషయం అధినేత దృష్టికి రావడంతో పాటు, ఈ తంతు కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్న విషయాలు పరిగణనలోకి తీసుకున్న సీఎం.. పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు.. వివాహేతర బంధం పెట్టుకున్న నాయకులు తమ వద్దకు వచ్చినప్పుడు సీక్రెట్‌గా వీడియో రికార్డింగ్‌లు కూడా చేస్తున్నందున ఇలాంటి వ్యవహారంతో అనుబంధం పెట్టుకున్న నాయకుల గురించి పిన్ పాయింట్ ఇన్మర్మేషన్ సేకరించే పనిలో నిఘావర్గాలు కన్నేసినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed