- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదవుల కోసం పరిశీలకులను సిద్ధం చేసిన కేసీఆర్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను, ఐదు మున్సిపాలిటీలకు శుక్రవారం జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు టీఆర్ఎస్ పార్టీ పరిశీలకులను నియమించింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పరిశీలకుల పేర్లను ప్రకటించారు. • వరంగల్ కార్పొరేషన్ పరిశీలకులు – మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ • ఖమ్మం కార్పొరేషన్‌కు పరిశీలకులు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను, ఐదు మున్సిపాలిటీలకు శుక్రవారం జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు టీఆర్ఎస్ పార్టీ పరిశీలకులను నియమించింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పరిశీలకుల పేర్లను ప్రకటించారు.
• వరంగల్ కార్పొరేషన్ పరిశీలకులు – మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్
• ఖమ్మం కార్పొరేషన్‌కు పరిశీలకులు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి.
• కొత్తూరు మున్సిపాలిటీ పరిశీలకులు – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
• నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకులు – టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు
• సిద్దిపేట మున్సిపాలిటీ పరిశీలకులు – రవీందర్ సింగ్ (మాజీ మేయర్ కరీంనగర్ ), వంటేరు ప్రతాప్ రెడ్డి (ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
• అచ్చంపేట మున్సిపాలిటీ పరిశీలకులు – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
• జడ్చర్ల — మేరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్)
పరిశీలకులు గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని సీఎం ఆదేశించారు. పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల అబ్జర్వర్లు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని ఆదేశించారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.






