భలే వాడివోయ్..! నువ్వు నా సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నావే

by  |
భలే వాడివోయ్..! నువ్వు నా సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నావే
X

దిశ, వెబ్‌డెస్క్: కౌన్‌బనేగా కరోడ్ పతి ఏపీసోడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ 14ఏళ్ల బాలుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆట జరిగే సమయంలో 20 వేల పాయింట్ల ప్రశ్నకు బాలుడు చెప్పిన సమాధానంతో బిగ్ బీ ఆశ్చర్యపోయాడు. నీ టాలెంట్ తో నా సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నావే అంటూ చమత్కరించారు.

కేబీసీ యాజమాన్యం స్టూడెంట్స్ కోసం స్పెషల్ ఏపీసోడ్ ను షూట్ చేసింది. ఈ ఏపీ సోడ్ లో గుజరాత్ భారుచ్ కు చెందిన 14ఏళ్ల అన్మోల్ శాస్త్రీ కంటెస్టెడ్ గా పాటిస్పేట్ చేశాడు. తనని తాను బిగ్ బికి ఇంట్రడ్యూస్ చేసుకునే సమయంలో తనకు నాలుగు బలమైన కోరికలు ఉన్నట్లు చెప్పాడు.

నోబెల్ ప్రైజ్, ప్రపంచంలోనే ధనవంతుడిగా మారడం, ఆస్ట్రోఫీసిసిస్ట్ (ఖగోళ శాస్త్రవేత్త) అవ్వడం. ఇక సైంటిస్ట్ ల్లో ఏపీజే అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్‌లంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. నా కోరికలు తీర్చుకునేందుకు ఈ షోలో పాల్గొన్నట్లు తెలిపిన అన్మోల్..షోలో డబ్బు గెలిస్తే టెలిస్కోప్ కొంటానంటూ తన అభిరుచుల్ని బిగ్ బీతో పంచుకున్నాడు.

దీంతో అన్మోల్ మాటల తీరుకు ఫీదా అయిన బిగ్ బి సూటిగా మాట్లాడుతూ ఈ ఏజ్ లోనే నువ్వు ప్రొఫెసర్ లా ఉన్నావ్ ‘జిగ్యసు’అని ముద్దు పేరు పెట్టారు. అనంతరం కొనసాగిన ఆటలో కామిక్ పుస్తకాలలో, ఏ యువకుడిని రేడియా యాక్టీవ్ స్పైడర్ కుట్టడం వల్ల అతడు మానవాతీత బలం, వేగం మరియు గోడలకు అతుక్కునే సామర్థ్యాన్ని పొందుతాడు? అని అడగ్గా..అన్మోల్ ఏమాత్రం ఆలోచించకుండా పీటర్ పార్కర్ అని కరెక్ట్ సమాధానం చెప్పాడు.

ఆ తరువాత బిగ్‌బి అడిగిన వరుస ప్రశ్నలకు అన్మోల్ సమాధానం చెప్పడంతో బాలుడి టాలెంట్ కు ముగ్ధుడయ్యాడు. అన్మోల్ నా హోస్ట్ సీట్ కొట్టేసేలా ఉన్నాడంటూ నవ్వులు పూయించాడు. చివరకు టెస్ట్, వన్డే క్రికెట్‌లో ఎక్కువసార్లు రన్ అవుట్ అయిన క్రికెటర్ ఎవరు? అని బిగ్ ప్రశ్నించాడు. కానీ అన్మోల్ కు ఆన్సర్ తెలియకపోవడంతో.. క్విట్ అవుతానని బిగ్ బీకి తెలిపాడు. దాంతో అన్మోల్ రూ. 25 లక్షలు తీసుకొని షో నుంచి వెనుదిరిగాడు.



Next Story

Most Viewed