దీపిక పదుకొనే‌తో ఆడిషన్స్‌లో పాల్గొన్న మెగాస్టార్

by  |
దీపిక పదుకొనే‌తో ఆడిషన్స్‌లో పాల్గొన్న మెగాస్టార్
X

దిశ, సినిమా : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 13’లో భాగంగా ఒక సీన్‌ను రీక్రియేట్ చేశారు. కేబీసీ13 అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన రీసెంట్‌ ప్రోమోలో బచ్చన్ జీ.. దీపిక, ఫరాఖాన్‌ను హోస్ట్ చేయడం విశేషం. ఈ స్పెషల్ ఎపిసోడ్ విషయానికొస్తే.. నేను మీ సినిమాలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదా? అని బిగ్ బీ ప్రశ్నించగా ‘మీరు ప్రతీ ఒక్కరి డ్రీమ్ సర్’ అని రిప్లయ్ ఇచ్చింది ఫరా. నిజం చెప్పాలని ఫరాను మరోసారి అడగడంతో.. ఇప్పుడే ఒక సీన్ చేద్దామంటూ సిద్ధమైపోయింది. ‘రెడీ, యాక్షన్’ అనగానే దీపిక తన డెబ్యూ ఫిలిం ‘ఓం శాంతి ఓం’ నుంచి ‘ఏక్ చుట్కీ సింధూర్ కీ కీమత్’ అనే డైలాగ్ చెప్పింది. అమితాబ్ కూడా అదే డైలాగ్ చెప్తే.. ఫరా రీటేక్ కోరింది. అప్పుడే దీపిక కలగజేసుకుని కోస్టార్స్ చెబుతున్నది వినాలని సూచించడంతో.. బచ్చన్ జీ తనకు ‘సారీ’ చెప్పడం ఫన్ మూమెంట్‌గా నిలిచింది.

ఈ ప్రోమో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సోని ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్.. ‘కోస్టార్ దీపికతో ఫరాఖాన్.. అమితాబ్‌ను ఆడిషన్ చేస్తోంది. అతడు పాస్ అయ్యాడని తెలియాలంటే సెప్టెంబర్ 9-10 తేదీల్లో సోని చానల్ చూడండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.


Next Story

Most Viewed