‘కవ్వింత’ డైరెక్టర్ కథ ఫిక్స్

by  |
‘కవ్వింత’ డైరెక్టర్ కథ ఫిక్స్
X

‘కవ్వింత’ చిత్ర దర్శకులు విజయ్ చౌదరి త్రిపురనేని మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తొలి సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఆయన.. సెకండ్ సినిమాతో పక్కా హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించబోతున్న విజయ్ చౌదరి.. ప్రేక్షకులకు డిఫరెంట్ మూవీని అందిస్తామని చెబుతున్నారు. ఫైవ్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై తేళ్ల రమేష్ నిర్మించబోతున్న సినిమా ఈ ఏడాది చివరి నుంచి చిత్రీకరణ జరుపుకోనున్నట్లు తెలిపారు. ఓ యంగ్ హీరో సినిమాలో నటిస్తారని తెలిపిన నిర్మాత.. టాప్ టెక్నీషియన్లతో వర్క్ చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే నటీనటులు, టెక్నీషియన్ల పేర్లు వెల్లడిస్తామన్నారు.

Tags: Kavvintha, Vijay Choudary Tripuraneni, Tella Ramesh, Five Star Entertainment

Next Story

Most Viewed