- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజూరాబాద్ ప్రజలకు కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి..
<p>దిశ తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్ అన్న 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మీరు నియోజకవర్గానికి ఏం చేశారు.. నియోజకవర్గ ప్రజలందరికీ లోన్లు ఇస్తానని మోసం చేశావు.. నీ వ్యక్తిగత అభివృద్ధి తప్పా నియోజకవర్గానికి చేసింది శూన్యం అని, కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఏడున్నర ఏళ్లుగా మంత్రిగా పని చేసావ్ కానీ ఏనాడు నియోజకవర్గ ప్రజల […]</p>

దిశ తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్ అన్న 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మీరు నియోజకవర్గానికి ఏం చేశారు.. నియోజకవర్గ ప్రజలందరికీ లోన్లు ఇస్తానని మోసం చేశావు.. నీ వ్యక్తిగత అభివృద్ధి తప్పా నియోజకవర్గానికి చేసింది శూన్యం అని, కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఏడున్నర ఏళ్లుగా మంత్రిగా పని చేసావ్ కానీ ఏనాడు నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించలేదని మండిపడ్డాడు. నీ స్వప్రయోజనాల కోసం పాటుపడ్డావని ఆరోపించారు. ఈటల చేసింది ఏంటో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత ప్రాధాన్యం ఈటల కు ఇచ్చారని ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడని, సంక్షేమాన్ని విస్మరించాడని ధ్వజమెత్తారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






