ఖైదీ రీమేక్‌లో కత్రినా!

55

కార్తి హీరోగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సృష్టించిన చిత్రం ‘ఖైదీ’. తొలిసారి కన్నకూతురిని చూసేందుకు బయలుదేరిన ఓ తండ్రి మధ్యలో ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొంటాడు? ఖైదీ అయిన ఢిల్లీ అనే వ్యక్తి పోలీసులకు ఎందుకు హెల్ప్ చేయాల్సి వస్తుంది? చివరికి కూతురిని కలుసుకుంటాడా? లేదా? అనేది కథ. ఈ క్రమంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్‌లు, కూతురితో మాట్లాడే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

కాగా, ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే ఒరిజినల్ సినిమాలో హీరోయిన్ పాత్ర లేనప్పటికీ.. హిందీ వెర్షన్ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసి హీరోయిన్ పాత్రకు అవకాశం కల్పించారని టాక్. ఈ క్యారెక్టర్ కోసం కత్రినా కైఫ్‌ను సంప్రదించగా.. రోల్ చిన్నదే అయినా ఇంపార్టెన్స్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌కు క్యాట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..